calender_icon.png 25 October, 2025 | 1:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్కెట్ యార్డ్ మడిగలకు రిజర్వేషన్ల కేటాయింపు

24-10-2025 10:51:16 PM

శనివారం మడిగల  బహిరంగ వేలం పాట

చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల వ్యవసాయ మార్కెట్ వాణిజ్య మడిగలకు శుక్రవారం ఏఎంసి చైర్మన్ నర్ర వినోద మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రిజర్వేషన్లను లాటరీ పద్ధతిలో ఖరారు చేశారు. పట్టణ కేంద్రంలోని భువనగిరి రోడ్డు లో నిర్మించిన మొత్తం 30 వాణిజ్య మడిగలకు ఇటీవల నోటిఫికేషన్ వెలువడించగా, మడిగలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్సీ, జనరల్ గా రిజర్వేషన్లను నిర్ణయించారు. గ్రౌండ్ ఫ్లోర్లో 15, ఫస్ట్ ఫ్లోర్లో 15 మడిగలను నిర్మించగా వాటిలో పీహెచ్సీకి 1, ఎస్టీలకు 3, ఎస్సీలకు 5, బీసీలకు 9, రిజర్వేషన్ లను కల్పించగా జనరల్ కు 12 మడిగలను కేటాయించారు.

అయితే లాటరీ చీటీల ద్వారా ఆయా వర్గాల రిజర్వేషన్ అభ్యర్థులకు పైన, కింద మడిగలను కేటాయించారు. గ్రౌండ్ ఫ్లోర్ లో పిహెచ్సి కి 1, ఎస్సీలకు 3, ఎస్టిలకు 2, బీసీలకు 4, జనరల్ కు 4 కేటాయించగా  ఫస్ట్ ఫ్లోర్ లో ఎస్టీలకు 1, ఎస్సీలకు 2, బీసీలకు 4, జనరల్ కు  8,  కేటాయించి లాటరీ పద్ధతిలో చైర్మన్ నర్ర వినోద మోహన్ రెడ్డి మడిగలకు రిజర్వేషన్ లను కల్పించారు. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ లో పీహెచ్సీకి షాప్ నెంబర్ 12, ఎస్టీలకు  షాప్ నెంబర్ 3, 15 ఎస్సీలకు షాప్ నెంబర్ 7, 10, 13 బీసీలకు షాప్ నెంబర్ 1, 2, 4  జనరల్ కు షాప్ నెంబర్ 5, 8, 9, 11 షాపులను కేటాయించగా ఫస్ట్ ఫ్లోర్ లో ఎస్టిలకు షాప్ నెంబర్ 25, ఎస్సీలకు షాప్ నెంబర్ 17, 21 బీసీలకు షాప్ నెంబర్ 16, 24, 28, 29, జనరల్ కు షాప్ నెంబర్ 18, 19, 20, 22, 23, 26, 27, 30 లను నిర్ణయించారు.

ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కార్యాలయ కార్యదర్శి రాచమల్ల జానయ్య మాట్లాడుతూ శనివారం ఉదయం 11:30 కు స్థానిక మార్కెట్ యార్డులో దరఖాస్తు చేసుకున్న ఔత్సాహికుల సమక్షంలో బహిరంగ వేలం పాట ద్వారా  లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు.