calender_icon.png 25 October, 2025 | 1:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెగా రక్తదాన శిబిరం..

24-10-2025 10:47:55 PM

కోదాడ: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రీలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన మెగా రక్తదాన శిబిరాన్ని సిఐ శివశంకర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు నిరంతరం ప్రజలకు రక్షణగా ఉండి సేవలు అందిస్తారని, దేశ రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పాటుపడుతున్నారని, వారి త్యాగాలను కొనియాడారు. సుమారు 50 మంది పైగా రక్త దాన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ డాక్టర్ దశరథ్, టౌన్ సిఐ శివ శంకర్, టౌన్ ఎస్ఐ సుధీర్ కుమార్, ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి , పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు