24-10-2025 10:34:00 PM
రేగొండ,(విజయక్రాంతి): మండల కేంద్రంలోనీ స్థానిక పోలీస్ స్టేషన్ లో రేగొండ ఎస్సై కె.రాజేష్ శుక్రవారం పాఠశాల విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై రాజేష్ పోలీస్ స్టేషన్ లో జరిగే విధుల గురుంచి విద్యార్థులకు క్లుప్తంగా వివరించి పోలీస్ సేవలు ఏ విధంగా ఉపయోగించాలో విద్యార్థులకు తెలియజేశారు. అలాగే విద్యార్థులు చదువులలో బాగా రాణించి ఉన్నత స్థానాలు అధిరోహించాలని కోరారు. విద్యార్థులకు విద్యలో, సమాజంలో ఎలాంటి సందేహాలు ఉన్నా సలహాలు కావాలన్న నిష్పక్షపాతంగా పోలీసుల సేవలు వినియోగించుకోవాలని విద్యార్థులకు భరోసా ఇచ్చారు.