calender_icon.png 25 October, 2025 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుర్తుతెలియని వాహనం ఢీకొని చుక్కల దుప్పి మృతి

24-10-2025 10:46:03 PM

అచ్చంపేట: గుర్తు తెలియని వాహనం ఢీకొని చుక్కల దుప్పి మృతి చెందిన సంఘటన మన్ననూర్ లో చోటుచేసుకుంది. అటవీ శాఖ రేంజర్ వీరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున 5-6 గంటల సమయంలో అమ్రాబాద్ -మన్ననూర్ సమీపంలోని పివిటిజి పాఠశాల దగ్గర ప్రధాన రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో చుక్కలు దుప్పి మరణించింది. అటుగా వెళుతున్న ప్రజలు అటవీ సిబ్బందికి సమాచారం అందజేశారు. దీంతో వారంతా అక్కడికి వెళ్లి పంచనామా చేశారు. దాడిలో మరణించిన జింకను వాహనంలో తీసుకెళ్లి అడవిలో ఖననం చేశారు.  ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించడానికి సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని అటవీ అధికారులు వెల్లడించారు. వాహనాలు నడిపే సమయంలో వన్యప్రాణుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు.