calender_icon.png 23 September, 2025 | 8:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ల్యాణ లక్ష్మీ, షాధి ముబారక్ & సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

23-09-2025 05:07:49 PM

కోరుట్ల,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మల్లాపూర్ మండలానికి చెందిన 3,103,596/- ముప్ఫై ఒక లక్షల మూడువేళ ఐదువందల తొంభై ఆరు రూపాయల విలువగల 31 కల్యాణ లక్ష్మీ షాధి ముబారక్ చెక్కులను..మరియు 674,500/- ఆరు లక్షల డెబ్భై నాలుగు వేళ ఐదు వందల రూపాయల విలువగల 26 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే  అందించారు. 

ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.... ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కరోనా కష్ట కాలం లోనూ పింఛన్లు అందించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను విస్మరించి కల్లబొల్లి మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. యూరియా కొరత వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు యూరియా కొరత లేదని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్క హామీని సీఎం రేవంత్ రెడ్డి  నెరవేర్చలేదన్నారు.