23-09-2025 07:40:33 PM
మోర్తాడ్,(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం, మోర్తాడ్ మండల కేంద్రంలోని సీహెచ్సీ కేంద్రీయ ప్రభుత్వ ఆసుపత్రిలో 'స్వస్థ్ నారి సశక్త్ పరివార్ అభియాన్'లో భాగంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది.మండల కేంద్రంలోని, కేంద్రీయ ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు 'స్వస్థ్ నారి సశక్త్ పరివార్ అభియాన్' కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ శిబిరానికి దంత వైద్య నిపుణులు డా. ప్రవీణ్ కుమార్, న్యూరో ఫిజిషియన్ డా. చంద్రశేఖర్, జనరల్ సర్జన్ డా. సునీత, డా. వివేక్ హాజరయ్యారు. ఈ వైద్య నిపుణుల బృందం మొత్తం 104 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన రక్త పరీక్షలు చేయించి, విలువైన ఆరోగ్య సలహాలు అందించారు. ఈ సందర్భంగా, ఆర్మూర్ డిప్యూటీ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డిప్యూటీ డిఎంహెచ్వో డా. రమేష్ శిబిరాన్ని సందర్శించి, అందిస్తున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచిస్తూ, శిబిరంలో చేసిన ఏర్పాట్లను పర్యవేక్షించారు.