calender_icon.png 23 September, 2025 | 8:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత

23-09-2025 05:11:11 PM

జనగామ,(విజయక్రాంతి): మంగళవారం పట్టణంలోని బతుకమ్మ కుంటలో పచ్చదనం పరిశుభ్రత కొరకు జడ్పీ సీఈవో మాధురి షాతో కలిసి జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ పింకేష్ కుమార్ సంబంధిత అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాదు పరిరక్షణకు బాధ్యత తీసుకోవాలని అధికారులకు సూచించారు. పర్యాటకులకు ఆహ్లాదకరంగా ఉండేందుకు మొక్కలు అందంగా పెంచాలన్నారు.

బతుకమ్మ కుంటను అందంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఉద్యాన శాఖ అధికారి మాట్లాడుతూ.. బతుకమ్మ కుంటలో పచ్చదనం కొరకు ఐదు లక్షలు మంజూరి అయినట్లు తెలిపారు 3 లక్షలు గుంతలు తీసేందుకు మొక్కల పరిరక్షణకు ఖర్చు చేయనున్నా మన్నారు. రెండు లక్షలు మొక్కలకు ఖర్చు చేయడం జరుగుతుందని తెలియజేశారు. బతుకమ్మ కుంటలో పచ్చదనం వెల్లి విరిసేందుకు, ఆహ్లాదం పెంచేందుకు 2వేలు చిన్న మొక్కలు,  40 పెద్ద మొక్కలు నాటనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీధర్ రావు మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.