calender_icon.png 23 September, 2025 | 9:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్మశాన వాటిక, బతుకమ్మ ఘాట్ బీఆర్ఎస్ పార్టీయే అభివృద్ధి చేసింది..

23-09-2025 07:42:47 PM

బీఆర్ఎస్ నేత ఉప్పు జస్వంత్..

కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): ప్రగతినగర్ లోని ప్రధాన సమస్యలైన స్మశాన వాటిక, బతుకమ్మ ఘాట్ అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కృషి చేసిందని ఆ పార్టీ నాయకుడు ఉప్పు జస్వంత్ అన్నారు. ఈ విషయమై పలుమార్లు కలెక్టర్ ను, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ను కలవడం జరిగిందని వివరించారు. ప్రగతి నగర్ లో సుమారుగా 1.5 లక్షల జనాభా కలిగి ఉన్నదని వారికి స్మశాన వాటిక స్థలం లేకపోవడం దారుణం అన్నారు. ప్రగతి నగర్ లో ఆక్రమణలకు గురవుతున్న పార్కు స్థలాలను తిరిగి కార్పొరేషన్ అధికారులు వాపస్ తీసుకొని ప్రజల ఉపయోగాలు వాటిని వినియోగించాలని కోరారు.

ప్రగతి నగర్ లో స్మశాన వాటిక కొరకు స్థలాన్ని జిల్లా కలెక్టర్, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సంయుక్తంగా నిర్దిష్ట స్థలాన్ని చూపించాలని ఆయన కోరారు. స్థానిక అంబిర్ చెరువు కాలుష్యం, చెరువు ఆక్రమణల  పాలు కాకుండా స్థానికులు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. స్మశాన వాటికకు స్థలం విషయమై ఫిబ్రవరి 28న హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రగతినగర్ సందర్శించారని ఆయన గుర్తు చేశారు. అనంతరం ప్రతిపాదించిన స్మశాన వాటిక స్థలం వాసులు ఈ విషయమై సుప్రీంకోర్టుకు వెళ్లడంతో స్మశాన వాటిక స్థలాన్ని ఫైనల్ చేయలేకపోయారని వివరించారు. ఇప్పటికైనా ఎన్ఎంసి అధికారులు ప్రగతి నగర్ కు స్మశాన వాటిక స్థలాన్ని కేటాయించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.