29-01-2026 03:36:21 PM
పాల్వంచ,(విజయక్రాంతి): మేడారం జాతర సందర్భంగా పాల్వంచ నుంచి మేడారం వెళ్లే ఆర్టీసీ డ్రైవర్లకు, కండక్టర్లకు, సిబ్బందికి గురువారం భోజనం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాల్వంచ బస్టాండ్ నుండి మేడారం జాతరకు వెళ్ళు వారికి అక్కిరెడ్డి శ్రీనివాసరావు ( రేగళ్ల శ్రీను) పాల్వంచ బస్టాండ్ లో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన టెంట్ వద్ద 50 మంది ఆర్టీసీ సిబ్బందికి భోజనాల పొట్లాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అన్న సూక్తిని కొంతవరకైనా నేను పాటించాలని దృక్పథంతో వీరికి భోజనం సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎస్ ఎం రామ్ కుమార్ సిబ్బంది మరియు ఆర్టీసీ రిటైర్ ఎస్ ఎం ఇజ్రాయిల్ లింగయ్య సామాజిక సేవ కార్యకర్త యడ్లపల్లి శ్రీనివాసరావులు పాల్గొన్నారు