90.99 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి
03-07-2026 12:00 AM
అదనపు కలెక్టర్ మధు మోహన్
గద్వాల, జూలై 2: జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించెందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని అదనపు కలెక్టర్ మధు మోహన్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో అదనపు కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా 90.99 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయిందని అధికారులు తెలిపారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, బీఎల్వోలు పంపిణీ చేసిన ఫారాలను ఓటర్లు పూర్తి వివరాలతో నింపి తిరిగి అందజేసేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసి, అభ్యంతరాల పరిశీలన అనంతరం అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపారు.






