3 July, 2026 | 1:09 AM

ఎమ్యూనరేషన్ పత్రాల పంపిణీలో నిర్లక్ష్యం వీడాలి

03-07-2026 12:00 AM

ఎమ్మెల్యే కృష్ణారావు

కూకట్ పల్లి, జులై 2 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న  ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్ )సర్వే సందర్భంగా అధికారులు ఓటర్లకు సహకరించి వారి ఓట్లు రద్దు కాకుండా చూడాలని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా కూకట్పల్లి నియోజకవర్గం కూకట్ పల్లి డివిజన్,ఫతేనగర్ డివిజన్ పరిధిలో జరుగుతున్న ఎమ్యునరేషన్ పత్రాల పంపిణీ కార్యక్రమాన్న ఎమ్మెల్యే కృష్ణారావు గురువారం పరిశీలించారు.

ఈ సందర్భంగా కూకట్పల్లి డివిజన్ పరిధిలోని ఓటర్లు బి ఎల్ వో లు ఎవరు ఎంతవరకు మమ్ములను సంప్రదించలేదని ఎమ్మెల్యే కు ఫిర్యాదు చేయగా ఎమ్మెల్యే కృష్ణారావు కూకట్పల్లి జెడ్ సి కు ఫోన్ చేసి ఎస్ ఐ ఆర్ పత్రాల పంపిణీ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వీడాలని ఆదేశించారు. ఎస్ ఐ ఆర్ సర్వే విషయంలో  నిత్యం అధికారులు పర్యవేక్షించి ఓటర్లకు సహాయ సహకారాలు అందించి వారి ఓట్లు రద్దు కాకుండా చూడాలని సూచించారు.

బి ఎల్ ఓ లతోపాటు బిఎల్‌ఎ లు కూడా ఎస్ ఐ ఆర్ ప్రక్రియ లో  భాగస్వాములు కావాలని, ఓటర్లకు సహకరించాలని సూచించారు. అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగించకుండా చూడాలని, ఏవైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం తోపాటు తన దృష్టికి సైతం తీసుకురావాలని స్థానికులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ  మెంబెర్ షిప్ ఇన్చార్జి గజ్జల నగేష్, మాజీ కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, పండాల సతీష్ గౌడ్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.