43 మంది లబ్ధిదారులకు 12 లక్షల 86 వేల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ, జులై 2 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసం వద్ద గురువారం బాన్సువాడ నియోజక వర్గంలోని 43 మంది ముఖ్యమంత్రి సహాయ నిది లబ్ధిదారులకు రూ 12 లక్షల 86 వేల చెక్కులను ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బాన్సువాడ మండలం 6 గురు లబ్ధిదారులకు రూ.2,03,000బాన్సువాడ మున్సిపాలిటీ ఇద్దరు లబ్ధిదారులకు రూ 34వేలు బీర్కూర్ మండలం ముగ్గురు లబ్ధిదారులకు రూ 1,12,000-, నసురుల్లబాద్ మండలం 05 గురు లబ్దిదారులకు రూ 1,31,000 మోస్రా మండలం ముగ్గురు లబ్దిదారులకు రూ 60,500, చందూర్ మండలం 05 గురు లబ్దిదారులకు రూ 1,25,500, వర్ని మండలం 4 గురు లబ్దిదారులకు రూ 1,81,000 రుద్రుర్ మండలం 9 మంది లబ్దిదారులకు రూ 2,39,500 -, కోటగిరి మండలం నలుగురు లబ్దిదారులకు రూ 1,34,000 -, పోతంగల్ మండలం ఇద్దరు సీఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారులకు రూ 65,500 మొత్తం నియోజక వర్గం లో 43 మంది లబ్ధిదారులకు రూ. 12,86,000 చెక్కులను అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు లబ్ధిదారులు అధికారులు పాల్గొన్నారు.






