calender_icon.png 16 August, 2025 | 3:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారిశుద్ధ్య సిబ్బందికి రెయిన్ జాకెట్స్ పంపిణీ

16-08-2025 12:47:13 AM

తుర్కయంజాల్, ఆగస్టు 15:పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య సిబ్బంది సేవలు మరువలేనివని తుర్కయంజాల్ మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి అన్నారు. తుర్కయంజాల్ పురపాలక సంఘం కార్యాలయంలో శుక్రవారం మున్సిపల్ కార్మికులకు రెయిన్ జాకెట్లను అమరేందర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. వారికి సరైన సదుపాయాలు అందజేయడం మన బాధ్యత అని తెలిపారు.

కార్మికులు చేస్తున్న సేవలకు వారిని ఎంత గౌరవించినా, ఎలాంటి సత్కారం చేసినా తక్కువేనని అన్నారు. శానిటేషన్ సిబ్బంది ఒకరోజు పనిచేయకపోయినా పట్టణం అస్తవ్యస్థంగా మారే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో సిబ్బంది ప్రాణాలకు తెగించి పనులు చేస్తారని అన్నారు. రెయిన్ జాకెట్లు అందజేయడం వల్ల వారికి కొంత ఉపశమనం దక్కే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, ఆర్వో శ్రీనివాసులు, డీఈ భిక్షపతి, ఏఈ చంద్రశేఖర్ రెడ్డి, ఎన్విరాన్ మెంట్ ఇంజినీర్ సురేష్, మున్సిపల్ సిబ్బంది శ్రీను రెడ్డి, ప్రవీణ్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.