calender_icon.png 17 August, 2025 | 12:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న మాజీ మేయర్ సునీల్‌రావు

16-08-2025 12:47:13 AM

కొత్తపల్లి, ఆగష్టు 15(విజయక్రాంతి): క రీంనగర్ నగరంలోని పలు ప్రాంతాల్లో ని ర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో బిజెపి నాయకులు,మాజీ మేయర్ యాద గి రి సునీల్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొని జా తీయ పతాకావిష్కరణ చేశారు. జాతీయ జెం డాకు గౌరవవందనం చేస్తూ జాతీయ గీతా లాపన చేశారు..భగత్ నగర్ లోని క్యాంపు కార్యాలయంలో కాలనీవాసులతో కలిసి జా తీయ పతాక ఆవిష్కరణ చేశా రు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, క రీంనగర్ ఎం పీ బండి సంజయ్ కుమార్  కా ర్యాలయం లో నిర్వహించిన వేడుకల్లో బిజెపి జిల్లా అ ధ్యక్షుడు కృష్ణారెడ్డితో మరియు బీజేపీ మా జీ కార్పొరేటర్లు, నాయకులతో కలిసి పాల్గొ న్నారు.భగత్ నగర్ లో చైతన్య యువజన సంఘం సభ్యులు, సీనియర్ సిటిజన్స్, కాల నీవాసులతో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఎ గురవేశారు. అనంతరం భగత్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో కలిసి జాతీయ పతాకావిష్కరణ గావించారు.

రామచంద్ర పూర్ కాలనీ బైపాస్ రోడ్డులో గల పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిం చి, ముదిరాజ్ సంఘం సభ్యులు మరియు మాజీ కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ-వేణు గా రితో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించా రు. గోదాంగడ్డ ప్రాంతంలోని ఎస్.బి.ఎస్ ఫంక్షన్ హాల్ ఎదురుగా బిజెపి నాయకులు పొన్నం మొండయ్య గౌడ్ , తదితరులతో జెండా ఆవిష్కరణ చేశారు.భగత్ నగర్ లోని ఆదర్శ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో అయ్యప్ప టెంపుల్ వద్ద నిర్వహించిన స్వాతంత్ర వేడుకలో పాల్గొని జాతీయ పతాకావిష్కరణ చేశారు.