calender_icon.png 16 August, 2025 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలకు బిజెపి వ్యతిరేకం

16-08-2025 12:48:24 AM

స్థానిక ఎన్నికల్లో స్వతంత్రంగానే పోటీ చేస్తాం

సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య

మణుగూరు,(విజయక్రాంతి): కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకంగా పని చేస్తుందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య అన్నారు. శుక్రవారం స్థానిక శ్రామిక భవన్ లో జరిగిన పర్టీ  సమావేశం లో అయన  పాల్గొని మాట్లాడారు.  ఓబీసీని అని చెప్పుకుంటున్న మోదీ.. 11 ఏళ్ల పాలనలో బీసీల కోసం ఏం చేశారని ప్రశ్నించారు. బీజేపీ నేతలకు బీసీల పట్ల నిజంగా చిత్త శుద్ధి ఉంటే జనగణనలో భాగంగా కులగణననూ చేపట్టా లన్నారు. దేశ వ్యాప్తంగా బీసీ జనాభా ఎంత ఉందో తేలాక, రాజ్యాంగ సవరణ ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ను కల్పించి, 9వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్‌ చేశారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కేటాయించే వరకు పార్లమెంటులో ఆమోదించే వరకు సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో సిపిఎం స్వతంత్రంగానే పోటీ చేస్తుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీపై విశ్వాసంతో ప్రజలు గెలిపించారని, కానీ అధికా రంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతోందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తోందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను  వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.