calender_icon.png 9 May, 2025 | 11:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్నబియ్యం పంపిణీ దేశానికే ఆదర్శం

02-04-2025 12:55:53 AM

   కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు

జగిత్యాల, ఏప్రిల్ 1  (విజయక్రాంత: శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిడం దేశానికే ఆదర్శమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు పేర్కొన్నారు.

కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్ మండలం గుండంపల్లి శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి జాతర సందర్భంగా మంగళవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, మల్లాపూర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ అంతడుపుల పుష్పలత నరసయ్యతో కలిసి గుడ్డపల్లిలో సన్న బియ్యం పంపిణీ ప్రారంభించారు.

అలాగే కోరుట్ల మండలంలోని యూసుఫ్ నగర్, ఐలాపూర్, చిన్న మెట్టుపల్లి గ్రామాలలో కోరుట్ల మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డితో కలిసి కృష్ణారావు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.   కాంగ్రెస్ మండల అధ్యక్షులు కొంతం రాజం, పుండ్ర శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెరమాళ్ల సత్యనారాయణ, కోరుట్ల అధ్యక్షుడు తిరుమల గంగాధర్, మండల బీసీ సెల్ అధ్యక్షులు ముక్కేర లింబాద్రి, మాజీ ఎంపీటీసీ సభ్యులు గుగ్గిళ్ళ సురేష్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు సురేష్, చిన్న మెట్టుపల్లి అధ్యక్షుడు ఆర్మూర్ గంగాధర్, ఏఏంసి డైరెక్టర్ బొల్లె నరసయ్య, నాయకులు నాగునూరి గంగాధర్ గౌడ్, రామకృష్ణ, ముక్కెర రాజేష్, గడ్డం హనుమక్క, లక్పతి రెడ్డి, పద్మ, సోమయ్య, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.