09-05-2025 03:04:17 AM
జమ్మూ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌లు టార్గెట్
తిప్పికొట్టిన భారత్
లాహోర్ క్షిపణి వ్యవస్థ మటాష్
పాకిస్థాన్‌కు కాళరాత్రే
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ సైన్యం గురువారం రెండోరోజు కూడా పాకిస్థాన్‌లోని రక్షణ వ్యవస్థలను టార్గెట్ చేసి దాడులు చేసింది. దీనిలో భాగంగానే అత్యాధునిక ఎస్-400 సుదర్శన చక్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను వినియోగించి లాహోర్‌లోని క్షిపణి రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసింది. మెరుపుదాడి కారణంగా లాహోర్ నగరవాసులు ఉలిక్కిపడ్డారు. మరోవైపు పాక్ కూడా భారత్‌లోని శ్రీనగర్, జమ్మూ విమానాశ్రయం, జలంధర్, కపుర్తలా, చండీగఢ్ వంటి 15 ప్రాంతాలపై డ్రోన్లు ప్రయోగించింది.
వాటిలో కొన్నింటిని భారత సైన్యం కూల్చివేసింది. గురువారం రాత్రి భారత్‌లోని జమ్మూకశ్మీర్, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్‌లోని సరిహద్దు ప్రాంతాల పైకి యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లతో దాడిచేసింది. భారత సైన్యం ఆ దాడులను తిప్పికొట్టింది. ఆ రాష్ట్రాల్లో విద్యుత్‌ను నిలిపివేసి బ్లాక్ అవుట్ చేశారు. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని హెచ్చ రికలు చేశారు. ఒక ఎఫ్-16, రెండు జేఎఫ్-17 ఫైటర్ జెట్లను కూల్చివేసింది. మొత్తం ఎనిమిది డ్రోన్లను గగనతలంలోనే పేల్చివేసింది.
జమ్మూలోని అఖ్నూర్‌లో కూలిన ఎఫ్-౧౬ పాక్ యుద్ధ విమానం ఫైలట్‌ను భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. ఈ దాడులపై ఎప్పటికప్పుడు ప్రధా ని నరేంద్ర మోదీ సమీక్షించారు. జమ్మూపై పాక్ దాడులు ప్రారంభించగానే ప్రధానితో ఎన్‌ఎస్ ఏ దోవల్ సమావేశమయ్యారు. త్రివిధ దళాల అధిపతులతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమావేశం నిర్వహించారు.
అర్ధరాత్రి దాటిన తర్వాత ఇస్లామాబాద్, లాహోర్, సియాల్‌కోట్, పెషావర్, కరాచీ పోర్టులో భారీ పేలుళ్లు సంభవించినట్లు వార్తలు వచ్చాయి. పాకిస్థాన్‌కు ఇది కాళరాత్రే అన్నట్లుగా భారత వైమానిక సేన అక్కడ విరుచుకుపడుతున్నట్టు ఆ వార్తలు పేర్కొ న్నాయి. నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వద్ద పాక్ సైన్యం బుధవారం అర్ధరాత్రి కూడా కాల్పులకు తెగబడింది. ఈ దాడుల్లో భారత జవాను సహా 16 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ పాక్‌పై యుద్ధం ప్రకటించింది.