09-05-2025 02:53:13 AM
న్యూఢిల్లీ, మే 8: ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగుతోందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆపరేషన్‌లో భాగంగా ఇప్పటివరకు దాదాపు వంద మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు పేర్కొన్నారు. గురువారం పార్లమెంట్ ప్రాంగణంలో కేంద్ర ప్రభు త్వం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ పాక్, పీవోకే కేంద్రంగా ఉగ్రవాద స్థావరాలపై జరిపిన ఆపరేషన్ వివరాలను అఖిలపక్షానికి వివరించారు.
రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. తొమ్మిది ఉగ్రస్థావరాలపై అత్యంత కచ్చితత్వంతో దాడులు నిర్వహిం చామన్నారు. ఇప్పటివరకు దాదాపు 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఎదురు చూస్తున్నామని, ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఆపరేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించలేమన్నారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పెంచాలన్న ఉద్దేశం ఎంతమాత్రం లేదని తెలిపారు.
అయితే పాక్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే మాత్రం వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. ఇక ‘ఆపరేషన్ సిందూర్’ మాత్రం కొనసాగుతుందని వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత అఖిలపక్ష భేటీ జరగడం ఇది రెండోసారి. ఈ భేటీకి కేంద్రం తరఫున రాజ్‌నాథ్ సింగ్ సహా మంత్రులు అమిత్ షా, ఎస్. జైశంకర్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు.
ప్రతిపక్షం నుంచి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సహా తృణ ముల్ కాంగ్రెస్ నుంచి సందీప్ బందోపాద్యాయ్, డీఎంకే నుంచి టీఆర్ బాలు, ఆప్ నుంచి సంజయ్ సింగ్, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తదితరులు పాల్గొన్నారు.
పాక్‌పై పోరుకు ప్రతిపక్షాలు కలసిరావాలి: ప్రధాని మోదీ
అఖిలపక్ష భేటీ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సందేశాన్ని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చదివి వినిపించారు. క్లిష్ట పరిస్థితుల్లో దేశమంతా ఐక్యంగా నిలబడాల్సిన అవసరముందని మోదీ పిలుపుని చ్చినట్టు తెలిపారు. పాకిస్థాన్‌తో పోరులో ప్రతిపక్షాలు తమతో కలిసి నడవాలని సందేశం ద్వారా విజ్ఞప్తి చేశారని వెల్లడించారు.
ఈ సందర్భంగా ‘ఆపరేషన్ సిందూర్’ పై ప్రతిపక్ష పార్టీలు ప్రశంసల జల్లు కురిపించాయి. భారత సైన్యం మన గగనతలం నుంచే ఉగ్రవాదుల స్థావరాలను కూల్చడంపై హర్షం వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై కేంద్రం జరుపుతున్న పోరాటానికి తమ పూర్తి మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని విపక్షాలు ఐక్యంగా ప్రకటించాయి.
రాజకీయాలకు తావు లేదు
ఆపరేషన్ సిందూర్ వివరాలు, ప్రభుత్వ ఉద్దేశాలను రక్షణమంత్రి రాజ్‌నాథ్ ప్రతిపక్ష నేతల కు వివరించారు. అయితే ఇది కొనసాగుతున్న ఆపరేషన్ గనుక సాంకేతిక అంశాలను ఆయన వెల్లడించలేకపోయారు. ప్రతిపక్షాలు అత్యంత పరిణితో వ్యవహరించాయి. ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ అంశం లో రాజకీయానికి తావు లేదు
కిరణ్ రిజుజు, పార్లమెంటరీ
వ్యవహారాల శాఖ మంత్రి
కేంద్రానికి పూర్తి స్థాయి మద్దతు
ఈ క్లిష్ట సమయంలో కేంద్రానికి ప్రతిపక్షం పూర్తి మద్దతుగా ఉంటుంది. ఉగ్రవాదంపై పోరుకు అన్ని పార్టీలు కలసివస్తాయి. పహల్గాం ఉగ్రదాడి అనంతరం నియంత్రణ రేఖ వద్ద పాక్ కాల్పులకు తెగబడుతూనే ఉంది. ఈ చర్యను ఉపేక్షించేది లేదు. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’కు పూర్తిగా సహకరిస్తాం.
మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేత
రాజ్‌నాథ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
‘ఆపరేషన్ సిం దూర్’ కొనసాగిస్తామని స్పష్టం చేసిన రాజ్‌నాథ్ సింగ్ నిర్ణయాన్ని స్వాగతిస్తు న్నాం. యమదూతల రూపంలో పహల్గాంలోకి చొరబడి 26 సోదరిమణుల సిందూరాన్ని లాక్కున్న ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టేవరకు పోరాటం ఆపొద్దు.
సంజయ్ రౌత్, శివసేన (యూబీటీ) ఎంపీ
ఐక్యంగా నిలబడుతాం
ఆపరేషన్ సిందూర్‌పై ప్రతిపక్షాలు ఐక్యంగా నిలిచి ప్రభుత్వానికి అండగా నిలుస్తాం. దేశం కోసం కేంద్రం తీసుకునే చర్యలకు పూర్తి మద్దతు ప్రక టిస్తున్నాం. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని, కొనసాగుతుందని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. ఖర్గే జీ చెప్పినట్టు అన్ని విషయాలు ఇక్కడ మాట్లాడలేం.
రాహుల్ గాంధీ,
లోక్‌సభ ప్రతిపక్ష నేత
* ఆపరేషన్ సిందూ ర్‌పై మన సాయుధ దళాలను, ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా. పహ ల్గాం ఉగ్రదాడికి పాల్పడిన టీఆర్‌ఎఫ్‌కు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్త ప్రచారాన్ని నిర్వహించాలి. టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తించే విధంగా అమెరికాను అభ్యర్థించాల ని కోరుతున్నా. అలాగే ఫైనాన్షియ ల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్‌లో పాక్‌ను గ్రే పెట్టాలి.
అసదుద్దీన్ ఒవైసీ,
ఏఐఎంఐఎం అధినేత