19-09-2025 06:03:50 PM
కోరుట్ల రూరల్,(విజయ క్రాంతి): పరిసరాల పరిశుభ్రత ను పాటించాలని తద్వారా ఏ విధమైన వ్యాధుల బారిన పడకుండా ఉంటామని కోరుట్ల ఎంపీడీవో ఓదెల రామకృష్ణ అన్నారు. శుక్రవారం మండలంలోని కల్లూరు గ్రామంలో గల కేజీబీవీ విద్యార్థులతో స్వచ్ఛతాహి సేవ 2025 సంబంధించి కల్లూరు గ్రామంలో విద్యార్థులతో స్వచ్ఛత ర్యాలీనీ నిర్వహించారు. అనంతరం గ్రామంలోని అంబేద్కర్ కూడలి వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎంపీడీవో అవగాహనను కల్పించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని,ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకూడదని తెలిపారు. పరిసరాలు శుభ్రంగా ఉంచడంలో ప్రజల భాగస్వామ్యం చేయాలని సూచించారు.