19-09-2025 06:32:01 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో హోమ్ సైన్స్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సైంటిస్ట్ గా పని చేస్తున్న డాక్టర్ ప్రియాసుగంధి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన స్వచ్ఛత సేవ కార్యక్రమంలో విద్యార్థులకు పెయింటింగ్, డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు. సమతుల్య ఆహారంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పెయింటింగ్, డ్రాయింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.