19-09-2025 06:49:28 PM
నిర్మల్(విజయక్రాంతి): ప్రధానమంత్రి మోడీ గారి జన్మదిన సందర్భంగా సేవా పక్వాడ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నిర్మల్ జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు పట్టణంలోని విజయ హై స్కూల్లో పిల్లలకు చిత్రలేఖన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రజిని వైద్య జిల్లా ఉపాధ్యక్షురాలు అలివేలు మంగ గారు మరియు రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఆడెపు లలిత గారు మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు సామ భూలక్ష్మి మరియు బిజెపి సీనియర్ నాయకులు ఆడెపు సుధాకర్ గారు నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సామ రాజేశ్వర్ రెడ్డి గారు మరియు స్కూల్ యాజమాన్యం పాల్గొనడం జరిగింది.