calender_icon.png 19 September, 2025 | 8:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరికలు

19-09-2025 06:46:18 PM

చిట్యాల,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని శుక్రవారం తెలంగాణ రాష్ట్ర డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి అన్నారు.  చిట్యాల మండలంలోని ఉరుమడ్ల  గ్రామానికి చెందిన పలువురు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తెలంగాణ రాష్ట్ర డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి. పార్టీలో చేరిన వారు  కోనేటి ఎల్లయ్య, కోనేటి నరసింహ, కోనేటి నాగయ్య, జన్నపాల బక్కయ్య, పాకాల లింగయ్య, రొయ్య గోపాల్, సుంకరబోయిన నాగయ్య, కోనేటి లింగస్వామి, సింగపంగా నరసింహ తదితరులు చేరారు.