19-09-2025 05:31:40 PM
చండూరు,(విజయక్రాంతి): క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడతాయని చండూరు మండల విద్యాధికారి వి.సుధాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం చండూరు మండల కేంద్రంలోని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సౌజన్యంతోచండూరు హైస్కూలో నియోజకవర్గ స్థాయి ఎస్జిఎఫ్ఐ క్రీడలను చండూరు మండల తహసిల్దార్ చంద్రశేఖర్, చండూరు మున్సిపల్ కమిషనర్ ఎస్. మల్లేశం వారితో కలిసి ఆయన క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యతో పాటు క్రీడారంగంలో కూడా విద్యార్థులు రాణించాలని అయినా అన్నారు.