19-09-2025 05:53:06 PM
వలిగొండ,(విజయక్రాంతి): అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందుతాయని భవనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. వలిగొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో లబ్దిదారులకు 50 కల్యాణ లక్ష్మీ మరియు షాధీ ముభారక్ చెక్కులు, 94 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడపిల్లలకు వరం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం అని అన్నారు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు గత ప్రభుత్వం కంటే కంటే బాధితులకు ఎక్కువ మొత్తంలో అందుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీవో శేఖర్ రెడ్డి తహసిల్దార్ దశరథ ఎంపీడీవో జలంధర్ రెడ్డి డిప్యూటీ తహసిల్దార్ పల్లవి తదితరులు పాల్గొన్నారు.