19-09-2025 05:50:02 PM
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని లోతుకుంట గ్రామ పరిధిలో గల మోడల్ స్కూల్ ను శుక్రవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను వారి సమస్యలను తెలియజేయమనగా విద్యార్థులు ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి కి తమ సమస్యలను విన్నవించారు.
విద్యార్థులు పాఠశాలకు వచ్చేందుకు రవాణా సదుపాయం కల్పించాలని కోరగా వెంటనే యాదగిరిగుట్ట డిపో మేనేజర్ తో మాట్లాడి ఉదయం, సాయంత్రం వలిగొండ నుండి మోడల్ స్కూల్ కు బస్సు నడపాలని తెలియజేశారు. అదేవిధంగా స్కూల్ కి కిచన్ షెడ్, కంప్యూటర్ రూం కు విండోస్, బాయ్స్ టాయిలట్స్ కావాలని తెలియజేయగా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం విధ్యార్థులతో కలిసి బోజనం చేశారు.