19-09-2025 05:59:35 PM
నిర్మల్,(విజయశాంతి): విద్యాశాఖ జారీ చేసిన విద్యా కేలండర్ ను పక్కగా అమలు చేయాలని విద్యాశాఖ ఆర్జెడి సత్యనారాయణ అన్నారు. గురువారం డీఈవో కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ పథకాలపై సమీక్ష నిర్వహించారు. పాఠశాల రికార్డులను పరిశీలించారు పెండింగ్ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సంవత్సరం ప్రభుత్వం ద్వారా మంజూరు నిధులు చేపట్టిన పనులు పూర్తి చేసిన పనులు పెండింగ్ పనులు నిర్వాణాకు తీసుకోవాల్సిన చర్యలపై విద్యాశాఖ అధికారులకు సూచనలు చేశారు.