గిరిజనులకు సత్యసాయి సేవకుల వితరణ
80 మందికి దప్పట్లు, 120 మందికి మెడికల్ కిట్లు అందజేత
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం అడవి సారంగాపూర్ గ్రామపంచాయతీ అనుబంధ గ్రామాలైన జిల్లేడు కుంట, రాజుల మడుగు, కొత్తవాడ, గ్రామాల్లో ఆదివారం శ్రీ సత్యసాయి సంఘ సేవకుల ద్వారా ఆదివాసి గిరిజనులకు 80 దుప్పట్లు, 120 మెడికల్ కిట్లు అందజేసారు. ఈ మేరకు ఆ సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షులు భీమ్ సింగ్ మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనులకు సేవ చేయడం ఎంతో ఆనందదాయకమని ఇప్పటికీ తాము నిర్మల్ జిల్లా కేంద్రంలో జె జి ఖాన్ ఆసుపత్రిలో నిత్య అన్నదానం చేస్తున్నామని, ప్రసూతి అవసరాలకు ప్రతి ఒక్కరు అక్కడికి రావాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ సభ్యులు నర్సారెడ్డి ,మధుకర్ రావు ,రాజేశ్వర్, సిహెచ్ రత్నాకర్ రావు, చింతపండు సత్తయ్య, సర్పంచ్ అంకుష్ రావు ,తదితరులు పాల్గొన్నారు.






