15 April, 2026 | 11:38 PM

లింగమంతుల స్వామిని దర్శించుకున్న వట్టె జానయ్య యాదవ్

04-01-2026 03:42 PM

చివ్వెంల,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా, చివ్వెంల మండలం దురాజ్‌పల్లి గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ లింగమంతుల స్వామి దేవాలయాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ వట్టె జానయ్య యాదవ్ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.

ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పోలె బోయిన నర్సయ్య యాదవ్ దేవాలయ నిర్మాణాలు, అభివృద్ధి పనుల వివరాలను వట్టె జానయ్య యాదవ్‌కు వివరించారు. స్వామివారి దర్శనం పూర్తయ్యే వరకు ఆయన పార్టీ ముఖ్య కార్యకర్తలతో కలిసి ఆలయ ప్రాంగణంలోనే ఉన్నారు.

ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, సూర్యాపేట టౌన్ అధ్యక్షుడు కుంభం నాగరాజు, పెన్‌పహాడ్ మండల అధ్యక్షుడు ఆవుల అంజయ్య, ఆత్మకూరు (ఎస్) మండల అధ్యక్షుడు బొల్లె సైదులు, చింతకాయల ప్రణయ్, ఆరాల రమేష్, వల్లాల బుచ్చయ్య, వట్టె లింగరాజు, శివ తదితరులు పాల్గొన్నారు.