04-01-2026 03:39:34 PM
బిజెపి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి.
చిట్యాల,(విజయక్రాంతి): యువకులు చిట్యాల పట్టణంలో నిర్వహిస్తున్న మెగా క్రీడోత్సవంను సద్వినియోగం చేసుకోవాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి కోరారు. ఆదివారం బీజేపీ చిట్యాల పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో భువనగిరి పార్లమెంట్ మెగా క్రీడోత్సవం (సంసద్ ఖేల్ మహోత్సవ్ ) కు సంబంధించిన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశమునకు ముఖ్య అతిధులుగా బీజేపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి లు పాల్గొన్నారు.
నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామoలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సఇస్తూ మండల స్థాయి, జిల్లాస్థాయి, పార్లమెంట్ పరిదిలో కబ్బాడి, కోకో, వాలీబాల్, క్రికెట్ ఆటల పోటీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. కావున నకిరేకల్ నియోజకవర్గం లో అన్ని మండలాల యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం బీజేపీ నాయకులు చిట్యాల మున్సిపల్ పరిధిలో శివనేని గూడం డంపింగ్ యార్డ్ తొలగించాలని, డంపింగ్ యార్డ్ నుండి వెలువడే పొగ, దుర్వాసన, దుమ్ము, ధూళి ద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిరసన తెలియజేస్తూ, డంపింగ్ యార్డ్ ను తొలగించని యడల బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ప్రభుత్వం ను హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు నకిరేకంటి మొగులయ్య, మండల వెంకన్న, మాస శ్రీనివాస్, కంబాల పల్లి సతీష్,చికిలం మెట్ల అశోక్, కన్నె బోయన మహాలింగం, కూరెళ్ల శ్రీనివాస్, పల్లె వెంకన్న, రుద్రవరం లింగ స్వామి, సంజయ్ దాస్, కందటి చంద్ర రెడ్డి, కన్నె బోయన మురళి, నకిరేకల్ నియోజకవర్గం లోని అన్ని మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.