27 July, 2026 | 12:40 AM

జిట్స్‌లో స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ

27-07-2026 12:05 AM

మానకొండూరు, జూలై 26 (విజయ క్రాంతి): జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థులకు 18,000 స్కాలర్షిప్ అందజేశారు. జ్యోతిష్మతి విద్యాసంస్థల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు విద్యార్థులు ఎలిగేటి నీరజ, గాజుల బద్రీయ, చతుర్వేది సిరి, దేశరాజుల రేశ్వంత్ చారి, ఆరే శ్రీనిధి, సదినేటి వాసవి, కంటే దేవర్షిని, పులిపాక ప్రశాంత్, గాడిచర్ల వర్షశ్రీ, అర్సమ్ గణేష్, మెట్టు సమీక్ష, రాగిళ్ల మనోజ్, ఎజ్జిగిరి విజయ్, మహమ్మద్ షజోరుద్దీన్, సైని రుచిత, గంగుల అభినయశ్రీలకు 18 వేల రూపాయల స్కాలర్షిప్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, కళాశాల ప్రతినిధులు పాల్గొన్నారు.