27 July, 2026 | 12:54 AM

కన్నుల పండువగా పోచమ్మ బోనాలు

27-07-2026 12:04 AM

కొత్తపల్లి,జూలై26(విజయక్రాంతి): కరీంనగర్ నగరంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ తల్లి బోనాల వేడుకలు అత్యంత వైభవంగా, కన్నుల పండువగా నిర్వహించారు. నగరంలోని చింతకుంట, కిసాన్ నగర్, శివాజీ నగర్, పసుల నారాయణ కాలనీ ప్రాంతాలలో భక్తులు అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించారు.ఈ వేడుకలకు కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్, మేయర్ కొలగాని శ్రీనివాస్, మున్నూరు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సన్న ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ఈ సందర్భంగా వారు స్వయంగా అమ్మవారి బోనం ఎత్తుకొని ఆలయం వరకు చేరుకుని, భక్తిశ్రద్ధలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అతిథులు మాట్లాడు తూ.. అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, కాలం కలిసివచ్చి సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు కళకళలాడాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్లకు చెందిన నాయకులు, మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.