గోపనపల్లిలో ఘనంగా పోచమ్మ పండుగ
22-08-2026 01:51 AM
దేవరకద్ర, ఆగస్టు 21 విజయ క్రాంతి : మహబూబ్నగర్ జిల్లా గోపనపల్లి అత్యంత వైభవంగా శుక్రవారం పోచమ్మ బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు.
అనంతరం పోచమ్మ గుడి దగ్గర లో పెద్ద ఎత్తున బోనాలతో అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ వేడుకలలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుమ్మరి రాంబాబు, కోట శ్రీకాంత్ రెడ్డి గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు.






