calender_icon.png 23 January, 2026 | 6:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వం నుంచి మంజూరైన స్ప్రింక్లర్ పైపులు అందజేత

23-01-2026 05:13:57 PM

కాచరాజు పల్లి సర్పంచ్ బాబు రామ్ నాయక్

నేరడిగొమ్ము,(విజయక్రాంతి): నేరేడుగొమ్ము మండలంలోని కాచరాజుపల్లి గ్రామానికి చెందిన 23 మంది రైతులకు ఎమ్మెల్యే బాలు నాయక్ ఆదేశాల మేరకు స్పింక్లర్లు పైపులను కాచరాజూపల్లి సర్పంచ్ రామవత్ బాబు రామ్ నాయక్ స్పింక్లర్లు పైపులు  పంచారు. అనంతరం మాట్లాడుతూ... రైతులని అభివృద్ధి దిశగా పయనించే మార్గం కాంగ్రెస్ పార్టీ తీసుకుందని రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువస్తున్నామని రానున్న రోజులలో రైతులకు ఇబ్బంది కలగకుండా మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నేతల హనుమంతు, వార్డ్ మెంబర్ బాలు, రామాంజనేయులు, గ్రామ పెద్దలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.