11-10-2025 12:00:00 AM
జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 10 (విజయక్రాంతి) : జగిత్యాల వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కోడూరు నవీన్ కుమార్ జన్మదిన సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేం ద్రంలోని బీసీ బాలికల వసంతి గృహంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆల్ ఇన్ వన్, మోడల్ పేపర్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో గణపురం కోట గుళ్ళు పరిరక్షణ కమిటీ గౌరవ అధ్యక్షులు మామిండ్ల మల్లికార్జున్ గౌడ్, బాలికలవసతి గృహం మేట్రిన్ జి.మాధవి, పరిరక్షణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.