calender_icon.png 11 October, 2025 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

6 గ్యారెంటీ ల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ: మంద సంజీవ రెడ్డి

10-10-2025 11:11:25 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందని బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవ రెడ్డి అన్నారు. బోడుప్పల్  బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఎన్నికల గ్యారెంటీ కార్డు ప్రకారం ఇవ్వాల్సిన కాంగ్రెస్ బాకీ కార్డు పోస్టర్ ను  ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలతో  అలివికాని హామిలు  ఇచ్చి వాటిని అమలుపర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు.

అలాగే 42 శాతం బీసీ రిజర్వేషన్ల విషయంలో బీసీ సోదరులను నయవంచన చేస్తుందన్నారు. రైతులకు రుణమాఫీ, రైతుబంధు, ధాన్యం కొనుగోళ్లపై బోనస్ ,మహిళలకు రూ 2500లు, వృద్ధులకు, బీడీ కార్మికులకు, దివ్యాంగులకు పెన్షన్ పెంపు, అడ బిడ్డల పెళ్ళిళ్లకు తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీ హామీలను అటకెక్కించిందన్నారు. బీసీలకు న్యాయం  చేయగల పార్టీ బిఆర్ఎస్ మాత్రమే అని సంజీవరెడ్డి తెలిపారు.