24-01-2026 09:41:59 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పని చేసి ప్రజల అభివృద్ధిని కోరే ప్రతి కార్యకర్తకు పార్టీ టికెట్ దక్కుతుందని డిసిసి అధ్యక్షులు వెడుమ బొజ్జు పటేల్ అన్నారు. శనివారం కానాపూర్ నిర్మల్ బైంసా మున్సిపాలిటీ నాయకులతో సమావేశం నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీలో కౌన్సిలర్ల కోసం ఆశావాదులు ఎక్కువగా ఉన్నారని అందర్నీ సమన్వయం చేసుకొని ప్రజల ద్వారా నిర్వహించిన సర్వేలో ఉన్న వ్యక్తులకి అవకాశం కల్పిస్తామన్నారు. ఒక కుటుంబానికి ఒకే పదవి ఉంటుందని రాజకీయ పైరవీలకు అవకాశం లేదని తెలిపారు. టికెట్ల విషయం పార్టీ అధిష్టానం చూసుకుంటుందని ప్రతి కార్యకర్త పార్టీ కోసం కష్టపడి పని చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పార్టీ నాయకులు ఇంద్రకాలా రెడ్డి నారాయణరావు పటేల్ విట్టల్ రెడ్డి శ్రీహరి రావు తదితరులు ఉన్నారు.