calender_icon.png 27 November, 2025 | 9:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హాస్టల్ విద్యార్థులకు స్వెటర్ల పంపిణీ..

27-11-2025 07:05:05 PM

జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి విజయలక్ష్మి

పాపన్నపేట (విజయక్రాంతి): విద్యార్థులకు చలికి రక్షణగా ఉండేందుకు స్వెటర్లు, మంకీ క్యాప్ లు పంపిణీ చేసినట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి విజయలక్ష్మి పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రం పాపన్నపేట హాస్టల్లోని విద్యార్థులందరికీ ఆమె స్వెటర్లు, మంకీ క్యాప్ లు పంపిణీ చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత చదువులు చదవాలని ఆమె ఆకాంక్షించారు.