30-10-2025 12:47:37 AM
మనోహరాబాద్, అక్టోబర్ 29 : తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా పాఠశాల చిన్నారులకు జిల్లా కాంగ్రెస్ నాయకులు, మనోహరాబాద్ మాజీ సర్పంచ్ చిటుకుల మహిపాల్ రెడ్డి ఆట వస్తువులను అందించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరై మనోహరాబాద్ ప్రైమరీ పాఠశాల, అంగన్వాడీ చిన్నారులకు పలురకాల ఆట వస్తువుల ప్రధానం చేయడం జరిగింది.
పేద ప్రజలకు సేవ చేయడం ఒక గొప్ప వరంగా భావిస్తూ తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తాను ముఖ్య అతిథిగా విచ్చేయడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, వెంకట్ రెడ్డి, నాగులపల్లి వెంకటరెడ్డి, ఫ్యాక్స్ డైరెక్టర్ జావేద్ పాషా, ఆదిల్, ప్రభుత్వ అధికారులు, అనధికారులు, మాజీ సర్పంచులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.