calender_icon.png 28 May, 2025 | 6:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ పంచాయితీలకు శాశ్వత పరిష్కారం

10-05-2025 01:03:35 AM

  1. త్వరలో 5వేల మంది సర్వేయర్ల భర్తీ
  2. సర్వేయర్ల శిక్షణకు ఈ నెల 17లోగా దరఖాస్తులు స్వీకరిస్తాం
  3. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి): రాష్ట్రంలో భూముల పంచాయితీలకు శాశ్వ త పరిష్కారం చూపాలనే లక్ష్యంతో సర్వే, సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్‌మెంట్‌ను మరింత బలోపేతం చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సచివాలయంలో సర్వే, సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ శాఖపై ఆయన సమీక్షించారు.

భూ భారతి చట్టంలో పేర్కొ న్న విధంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే ప్రస్తుతం ఉన్న 402 మంది సర్వేయర్లు సరిపోరని, మరికొంత మంది సర్వేయర్లు అవసరమవుతారని అన్నారు. దీనిని దృషి ్టలో పెట్టుకుని రాష్ర్ట వ్యాప్తంగా సుమారు 5వేల మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను తీసుకోబోతున్నామని వెల్లడించారు. లైసెన్స్‌డ్ సర్వే యర్ల శిక్షణకు అరత గలిగిన అభ్యర్థులనుం డి ఈ నెల 17వరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు.

అభ్యర్థులు ఇంటర్మీడియ ట్‌లో గణితం ఒక అంశంగా ఉండి, కనీసం 60శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఐటిఐ నుంచి డ్రాఫ్ట్స్ మన్ (సివిల్), డిప్లొమా (సివిల్), బీటెక్ (సివిల్) లేదా ఇతర సమానమైన విద్యార్హత కలిగి ఉండాలన్నారు. శిక్షణ ఫీజు ఓసీ అభ్యర్థులకు రూ.10 వేలు, బీసీ అభ్యర్థులకు రూ.5వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.2500 చెల్లించవలసి ఉంటుందన్నారు. 

ఎంపిక అయిన అభ్యర్థులకు జిల్లా కేంద్రాల్లో 50 రోజులు తెలంగాణ అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తారని తెలిపారు. సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, కమిషనర్ ఆఫ్ సర్వే, సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ శాఖ జ్యోతి బుద్ధ ప్రకాష్, సీసీఎల్‌ఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం మకరందు పాల్గొన్నారు.

అర్హులైన జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. వృత్తి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు నెలసరి పెన్షన్, తీవ్ర అనారోగ్యం, ప్రమాదాలకు గురై వృత్తి నిర్వహించలేని స్థితిలో ఉన్న జర్నలిస్టులకు శుక్రవారం నాంపల్లి ప్రెస్ అకాడమీ కార్యాలయంలో చెక్కులు అందజేశారు. ప్రెస్ అకాడమీ భవనాన్ని చిన్న చిన్న మరమ్మతులు పూర్తి చేసి ఈ నెలాఖరులోగా ప్రారంభిస్తామని తెలిపారు.

విడతల వారీగా రాష్ర్ట ప్రభుత్వం మంజూరు చేసిన రూ.42 కోట్లను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి, జర్నలిస్టుల సంక్షేమానికి ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై వచ్చిన వడ్డీ ఆధారంగా ఇప్పటివరకు రూ.22 కోట్లు ఖర్చు చేశామన్నారు.

మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు చెందిన 597 మందికి రూ.లక్ష-తో పాటు ఐదేళ్ల వరకు నెలకు రూ.3,00౦ చొప్పున పెన్షన్, వారి పిల్లలకు ట్యూషన్ ఫీజుల కింద 1 నుంచి పదో తరగతి వరకు చదివే పిల్లలకు నెలకు రూ.వెయ్యి చొప్పున గరిష్టంగా ఇద్దరికి అందిస్తామన్నారు. ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ వినయ్‌కృష్ణారెడ్డి పాల్గొన్నారు.