calender_icon.png 26 October, 2025 | 9:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్

25-10-2025 07:44:21 PM

కామారెడ్డి (విజయక్రాంతి): తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం IDOC ఆవరణలో స్థలాన్ని పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాలలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం రూ. 5.80 కోట్లు నిధులు కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్ అండ్ బి EE మోహన్ అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించి, పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో AEE, సిబ్బంది, సంబంధిత శాఖాధికారులు, తదితరులు పాల్గొన్నారు.