25-10-2025 07:46:58 PM
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్
ఏటూరునాగారం,(విజయక్రాంతి): ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఐటిడిఏ కొత్త భవన నిర్మాణం శంకుస్థాపన కొరకు అన్ని ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ అధికారులను ఆదేశించారు.శనివారం ఏటూరునాగారం మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.ఐటిడిఏ పి.ఓ. చిత్ర మిశ్రాతో కలిసి ఐటిడిఏ కొత్త భవన నిర్మాణం కొరకు స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొమురం భీమ్ స్పోర్ట్స్ స్టేడియం వద్ద అనువైన స్థలంను గుర్తించడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం ఉన్న ఐటిడిఏ భవనం శిథిలావస్థలో ఉన్నందున నూతన భవనం నిర్మాణం కొరకు గాను రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు.