calender_icon.png 10 August, 2025 | 9:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలసదనంలో రాఖీ పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్

09-08-2025 11:01:10 PM

బాలికలు, శిశువులకు కొత్త దుస్తులు అందజేత

కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ బాలసదనంలో నిర్వహించిన రాఖీ(Raksha Bandhan) పౌర్ణమి వేడుకల్లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి(District Collector Pamela Satpathy) పాల్గొన్నారు. బాలసదనం బాలికలతో మమేకమై వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. బాలికలు కలెక్టర్ కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. కలెక్టర్ కు మిఠాయి తినిపించారు. అనంతరం బాలసదనంలోని 16 మంది బాలికలకు, శిశు గృహాలో పెరుగుతున్న 9 మంది శిశువులకు సుమారు 100 కొత్త దుస్తులు అందజేశారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టెక్నికల్ టీచర్  సర్టిఫికెట్ కోర్సులో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచన మేరకు కుట్టు మిషన్ శిక్షణ పొందిన కొంతమంది బాలసదనం, శిశు గృహ పిల్లల నుండి కొలతలు తీసుకుని ఈ దుస్తులు కుట్టించి ఇచ్చారు.

ఈ దుస్తులను రాఖీ పౌర్ణమి సందర్భంగా పిల్లలకు కలెక్టర్ అందజేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ... బాలసదనంలోని పిల్లలంతా ఒకరికొకరు స్నేహపూర్వకంగా ఉంటూ ఉన్నత విద్య అభ్యసించాలని అన్నారు. చదువుపై దృష్టి పెట్టి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని సూచించారు. ఏమైనా అవసరాలు ఉంటే తనకు తెలియజేయాలని బాలికలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, బాలికల అభివృద్ధి అధికారి కృపారాణి, డిసిపీఓ పర్వీన్, సూపరింటెండెంట్ సంతోషిని,  శిశు గృహ మేనేజర్ తేజస్విని, ఉపాధ్యాయుడు మల్లయ్య పాల్గొన్నారు.