calender_icon.png 10 August, 2025 | 9:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది..

09-08-2025 11:03:44 PM

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్...

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆకట్టుకున్న మార్కండేయ శోభాయాత్ర...

రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): సిరిసిల్ల పట్టణంలో నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Government Whip Aadi Srinivas) అన్నారు. నూలుపౌర్ణమి సందర్భంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంకాలం నిర్వహించిన మార్కండేయ శోభయాత్ర కోసం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. పట్టణ పురవీధులలో మార్కండేయ శోభాయాత్ర నిర్వహించారు. పాత బస్టాండ్ లోని నేతన్న విగ్రహానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పూలమాల వేశారు. శోభరాత్రలో నాయకులను ప్రజలను పలకరిస్తూ ఆది శ్రీనివాస్ సందడి చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, పద్మశాలి సంఘ నాయకులు, జిందం చక్రపాణి గూడూరు ప్రవీణ్ బొల్లి రామ్మోహన్ చొప్పదండి ప్రకాష్ సంగీతం శ్రీనివాస్. పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు ప్రజలు పాల్గొన్నారు.