calender_icon.png 10 August, 2025 | 9:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివాసీ సంస్కృతిని భావితరాలకు అందిద్దాం..

09-08-2025 10:59:06 PM

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల (విజయక్రాంతి): ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయని, ఎంతో గొప్పతనం కలిగిన సంస్కృతిని కాపాడి భావితరాలకు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అన్నారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం మంచిర్యాల పట్టణంలోని వైశ్య భవన్ లో ఏర్పాటు చేసిన ఆదివాసీ దినోత్సవ వేడుకలకు హాజరైన జిల్లా కలెక్టర్, ఆదివాసి సంఘాల నాయకులకు గిరిజన సంప్రదాయ సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. ఆదివాసి, గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు.

గిరిజనులకు విద్య, వైద్యం అందించడంపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని, గిరిజన ప్రాంతాలలో ప్రభుత్వం పాఠశాలలను అభివృద్ధి చేసి సకల సదుపాయాలు కల్పించి గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధన అందించడం జరుగుతుందని, గిరిజన యువత పిల్లలు పాఠశాలలకు క్రమం తప్పకుండా వచ్చేలా అవగాహన కల్పించాలని తెలిపారు. గిరిజన ప్రాంతాలలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, గిరిజన మహిళలు, పిల్లల సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గిరిజన ప్రాంతాలకు రహదారుల సౌకర్యం కల్పించి ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని తెలిపారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు అందరిని అలరించాయి. శనివారం రోజున రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని బాలికలు జిల్లా కలెక్టర్ కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ఆదివాసి సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.