28-10-2025 06:16:25 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలకు సంబంధించి గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈనెల 27వ తేదీ నుంచి, నవంబర్ రెండవ తేదీ వరకు విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వారోత్సవాల్లో భాగంగా విజిలెన్స్ ప్రాముఖ్యతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఈ గోడప్రతుల ఆవిష్కరణ కార్యక్రమంలో విజిలెన్స్ ఇన్స్పెక్టర్ రవీందర్ సంతోషం, అసిస్టెంట్ జియాలజిస్ట్ వెంకట్ రెడ్డిలు పాల్గొన్నారు.