calender_icon.png 29 October, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్రకు ఇవ్వొద్దు

28-10-2025 06:21:18 PM

హనుమకొండ (విజయక్రాంతి): విద్యాశాఖ అధికారులు మధ్యాహ్న భోజన పథకం అక్షయపాత్రకు అప్పగించాలనే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, కార్మికులకు పెండింగ్ లో ఉన్న 8 నెలల జీతం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నిడిగొండ రజిత ప్రభుత్వాని డిమాండ్ చేశారు. మంగళవారం డిఈఓ కార్యాలయంలోని సూపర్డెంట్ కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్రకు ఇవ్వద్దని,పెండింగ్ బిల్లులు రాక, ఆర్థికంగా అప్పులను చేస్తూ పిల్లలకి పోషక ఆహారం అందించాలని ప్రభుత్వం పెట్టిన కొత్త మెనూ ప్రకారం మళ్లీ అప్పులు తెచ్చి పిల్లలకి మంచి పోషకాహారం అందిస్తుంటే, ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకాలను అక్షయపాత్ర లాంటి ప్రైవేట్ సంస్థలకు కట్టపెట్టాలని నిర్ణయాలు తీసుకురావడం సరైనది కాదని, వెంటనే ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని పెండింగ్లో ఉన్న బిల్లులను ఇవ్వాలని ఆమే డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కే. శాంత, పద్మ, ప్రేమలత, సంధ్య, సరోజన, సరిత, కల్పన, మమత, పర్వీన్, గౌసియా బేగం, తదితరులు పాల్గొన్నారు.