శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్న జిల్లా కలెక్టర్ హనుమంతరావు
13-09-2025 06:29 PM
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలోగల శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామిని శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు(District Collector Hanumantha Rao) సతీసమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కలెక్టర్ దంపతులకు పూర్ణకుంభంతో, వేద పండితుల మంత్రోచ్ఛారణాలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి విశిష్టతను తెలియజేసి కలెక్టర్ దంపతులను శాలువాతో సన్మానించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ దశరథ, ఆర్ఐ నగేష్, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.






