13-09-2025 06:29:18 PM
ఉత్తర్వులు జారీచేసిన జిల్లావిద్యాశాఖ అధికారి
నకిరేకల్,(విజయక్రాంతి): నకిరేకల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ విద్యార్థినిపై ఇంగ్లీషు ఉపాధ్యాయుడు మామిడి శ్రీనివాస్ (స్కూల్ అసిస్టెంట్) అసభ్యకర ప్రవర్తన, లైంగిక వేధింపులు వెలుగులోకి రావడంతో ప్రాథమిక విచారణ చేసి జిల్లా విద్యాశాఖ అధికారి బి బిక్షపతి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని మండల విద్యాశాఖ అధికారి మేక నాగయ్య శనివారం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ జరిపి నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారి పంపనైనదిఆయన తెలిపారు. మీడియా ద్వారా వార్తలను చూసి ఈ విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారి బి.బిక్షపతి ఉపాధ్యాయునడు మామిడి శ్రీనివాసును సస్పెండ్ చేస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేశారని అని తెలిపారు. తదుపరి విచారణ జరిపి ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు.