calender_icon.png 30 July, 2025 | 7:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

29-07-2025 07:27:27 PM

ఎల్లారెడ్డిపేట (విజయక్రాంతి): జిల్లాలోని ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ సీడ్స్ షాపుల నిర్వాహకులు తమ ఈ పాస్ యంత్రాలలోని నిల్వ దుకాణాల్లో ఎరువులు, ఇతర సరుకు నిల్వ సరిగా ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(Collector Sandeep Kumar Jha) ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ గోదాం, గొల్లపల్లిలో శ్రీ సాయినాథ్, బొప్పాపూర్ రోడ్ లోని శ్రీ మహేశ్వర ఆగ్రో ఏజెన్సీ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ సీడ్స్ దుకాణాల్లో కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి దుకాణాల్లోని రికార్డులను సరుకు నిలువను లైసెన్సులను వారు అమ్మే పురుగు మందులను పరిశీలించారు. ఎరువుల దుకాణాల్లోని స్టాక్ రిజిస్టర్లను, లైసెన్సులను పరిశీలించారు.

ఈపాస్ యంత్రంలోని స్టాకు.. గోదాంలో ఉన్నటువంటి స్టాకు యూరియా బస్తాలను స్వయంగా లెక్కించి, సరి చూసారు. స్టాకు లో స్వల్ప తేడాను గమనించి ఇకముందు స్టాక్ లో తేడా లేకుండా సరియైన విధంగా నిర్వహించాలని షాపు యజమానులను ఆదేశించారు. అనంతరం అల్మాస్పూర్ కేజీబీవీలో ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ విద్యార్థినీలకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. వంటగది స్టోర్ రూమ్ లో నిలువ ఉంచిన ఆహార పదార్థాల సామాగ్రి కూరగాయల నాణ్యతను పరిశీలించారు. ఆన్ అకాడమీ తరగతులపై ఆరా తీసి పలువురు విద్యార్థులతో పాఠ్యాంశాలు చదివించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు వివరాలు ఆర్ఓ ప్లాంట్ పనితీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ వెంట మండల ప్రత్యేక అధికారి అపజాలి బేగం,మండల విద్యాధికారి,పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.