calender_icon.png 30 July, 2025 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యోగ క్రీడా సాధకులకు రాష్ట్రస్థాయి సెలక్షన్

29-07-2025 07:20:24 PM

కామారెడ్డి అర్బన్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలోని యోగసాధకులు రాష్ట్రస్థాయి సెలక్షన్ కు హాజరుకావాలని యోగా అధ్యక్షులు రామ్ రెడ్డి(Yoga President Ram Reddy) తెలిపారు. రాష్ట్రస్థాయిలో పాల్గొనడానికి కామారెడ్డి జిల్లా కేంద్రంలో సెలక్షన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా యోగ భవన్లో 01 ఆగస్ట్ న సీనియర్, సీనియర్ A, B, C కేటగిరీలలో యోగాసన సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని యోగ సాధకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యోగ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు గడ్డం రాంరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ వయస్సుల వారిగా కేటగిరిలు విభజించడం జరిగిందన్నారు.

వయసు 18 నుండి 28 వరకు, 28 నుండి 35 సంవత్సరాల వరకు, 35 నుండి 45 సంవత్సరాలు ఉండాలి. 45 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల వరకు మరో కేటగిరిగా విభజించడం జరిగిందన్నారు. ఈ నాలుగు కేటగిరీలలో సెలక్షన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆసక్తి గల యోగ క్రీడాకారులు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని పోటీలో పాల్గొనవలసిందిగా కోరుతున్నామనీ తెలిపారు. జిల్లా స్థాయిలో ఎంపిక అయిన వారిని ఆదిలాబాద్ లో ఆగస్టు 7,8 తేదీలలో జరుగు రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనటానికి అర్హులు అవుతారని తెలిపారు. ఆసక్తి గల యోగ క్రీడాకారులందరూ  పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఈ నెంబర్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోగలరు. 9440037948 జిల్లా యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు యోగా రామ్ రెడ్డి, జిల్లా సెక్రెటరీ రఘుకుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ, అనిల్ కుమార్, లు అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు.